భగవద్గీత – అర్జున విషాద యోగము

యుద్ధం చెయ్యాలనుకొని ఒక చోట చేరిన మా వాళ్ళున్నూ పాండవులున్నూ ఏం చేశారు అని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగిన ప్రశ్నతో భగవద్గీత లోని మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగము మొదలవుతుంది. ఆ తరువాత దుర్యోధనుడు ద్రోణాచార్యునికి కొన్ని జాగ్రత్తలు చెప్పటం, వీరులందరూ తమ తమ శంఖాలు ఊదడం, అప్పుడు అర్జునుడు కోరగా సారథియైన కృష్ణుడు రథాన్ని రెండు సేనల మధ్య నిలపడం, అర్జునుడు అందరినీ చూసి, స్వజనాన్ని చంపాలా ఇప్పుడు నేను, అని దుఃఖించడం, తన … Continue reading భగవద్గీత – అర్జున విషాద యోగము

భగవద్గీత గురించి – మంచి, చెడు

భగవద్గీత గురించి - మంచి, చెడునా చిన్నప్పుడు మా గురువుగారు (తాతగారు) భగవద్గీత శ్లోకాలు పారాయణ చేస్తుంటే, అవి వినీ వినీ కొన్ని నాకు కూడా కంఠతా వచ్చేశాయి. అది గ్రహించి వారు ఆ తరువాత నాకు క్రమ పద్ధతిలో భగవద్గీత భట్టీయం వేయించారు. అది భట్టీయమే. ఎందుకంటే, అప్పుడూ ఇప్పుడూ కూడా నాకు సంస్కృతం రాదు. అలా భగవద్గీతతో మొదలైన నా అనుబంధం, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పెద్దయిన తరువాత భగవద్గీతపై వ్యాఖ్యానాలు, టీకా తాత్పర్యాలు, … Continue reading భగవద్గీత గురించి – మంచి, చెడు

ఎక్కడైనా ఇమడటం ఎలా?

చిన్నప్పటి నుండి ఇతరులతో, ముఖ్యంగా కొత్తవాళ్ళతో, కలవడం అలవాటైన వాళ్ళకి ఎక్కడైనా ఇమడటం పెద్ద కష్టం కాదు. కానీ అందరికీ అలా ఉండదుగా. నా మాట కొస్తే, 14 ఏళ్ళ వయస్సు వచ్చేవరకు జిల్లా సరిహద్దులు దాటలేదు. అప్పటి వరకు రైలు ప్రయాణం కూడా ఎరగను. చెప్పులు వేసుకోవడం అలవాటు కాకపోవడం వల్ల, ఎప్పుడు  పెద్దవాళ్ళు చెప్పులు కొన్నా, వారం తిరక్కుండా వాటిని ఎక్కడో పారేసుకుంటూ ఉండడం వల్ల, అటు చేసి ఇటు చేసి 14 ఏళ్ళ … Continue reading ఎక్కడైనా ఇమడటం ఎలా?

కథలలో లిష్టులు

కథలలో లిష్టులు (lists) ఏమిటి, ట్విష్టులు (twists) కదా ఉండాల్సింది అని అనుకుంటున్నారా. అదే గమ్మత్తు. అయితే ఈ గమ్మత్తు చేసింది ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది. అసలు లిష్టులు అంటే వాటిల్లో ఏముండాలి? మనం చెప్పే కథకి వాటికి లింకు (link) ఏమిటి? ఈ ప్రశ్న లన్నిటికీ మన సాహిత్యంలో దొరికే కొన్ని సమాధానాలు చూద్దాం. అసలు మన ఆదికావ్యమైన వాల్మీకి రామాయణం ఒక లిష్టుతోనే మొదలవుతుంది. వాల్మీకి మహర్షి నారదుడికి 16 గుణాల లిష్టు … Continue reading కథలలో లిష్టులు

పద్యమాలిక

"మాలిక" అంటే మాల, వరుస, దొంతర, పరంపర, సరణి - ఇత్యాది అర్థాలు ఉన్నాయి. సంగీతంలో రాగమాలిక అన్న ప్రక్రియ ఉంది. వివిధ రాగాలను వరుసగా మార్చుకుంటూ ఒకే పాట లేదా కృతి లోని చరణాలను పాడటం దీని లోని ప్రత్యేకత. ఒక రాగంలో పాడుతూనే, పాట లోని వివిధ భాగాలకు వేర్వేరు తాళాలను మార్చి పాడే పద్ధతిని తాళమాలిక అంటారు. "పద్యమాలిక" అంటే పద్యాల వరుస అని సామాన్యమైన అర్థము. తెలుగు ఛందస్సులో "పద్యమాలిక" అంటూ … Continue reading పద్యమాలిక

కు(సు)మతీ శతకము

నేను రచించిన "కు(సు)మతీ శతకము" అన్న పుస్తకం 17-06-2026న ఈ క్రింది లింకులో పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు. ఈ పుస్తకం మీద, మీరు సూచనలు/ వ్యాఖ్యలు ఇవ్వడానికి ఈ బ్లాగులో సదుపాయం ఉంది. ఉపయోగించుకోగలరు. https://ia600807.us.archive.org/10/items/kusumati-shatakamu-free-e-book/Kusumati%20shatakamu%20free%20e-book.pdf

తెలుగు భాష వ్యాకరణాల ప్రాముఖ్యత

తెలుగు భాష వ్యాకరణాల ప్రాముఖ్యతమనకి తెలుగులో గసడదవాదేశ సంధి, సరళాదేశ సంధి (అంటే, గజడదబాదేశ సంధి) అన్న రెండు హల్ సంధులున్నాయి. రెండవ పదంలో ఉన్న కచటతపలకి ఈ రెంటిలో ఏవి ఆదేశాలవుతాయో చూడంగానే అర్థమవుతుంది. గసడదవాదేశ సంధిలో మొదటి పదం ప్రథమా విభక్తి (డు, ము, వు, లు) అయి ఉంటే, సరళాదేశ సంధిలో మొదటి పదం ద్రుత ప్రకృతికం (చివర 'న్' లేదా 'న' ఉండేది) అయి ఉంటుంది. ఈ వ్యాకరణం పరమానందయ్య లాంటి … Continue reading తెలుగు భాష వ్యాకరణాల ప్రాముఖ్యత

సమస్యాపూరణాలు -I

01 - 09 - 2025న ప్రచురించిన "సమస్యాపూరణాల సమాహారం" అన్న నా పుస్తకంలో(Free E-Book), 456 సమస్యలకి నేను చేసిన 620 పూరణలు ఇవ్వబడ్డాయి. ఆ తరువాత పూరించిన సమస్యలు పుస్తక రూపంలో ఒక్కసారిగా ప్రచురించే ముందు ఇలా ఎప్పటికప్పుడు ఈ బ్లాగులో మీ ముందు ఉంచాలని అనుకున్నాను. ఈ భాగంలో 10 సమస్యలకి పూరణలు ఇవ్వబడ్డాయి. 1.  సమస్య: బలరాముడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్ కం. చెలు లన యతడే దారిని శిల … Continue reading సమస్యాపూరణాలు -I

Free E-Book on the Collection of Statistics Act, 2008

[Link to this Book was shared by E-Mail to the Hon’ble Prime Minister, the Hon’ble Minister of Statistics and the Hon’ble Minister of Law in the Union Government, the Cabinet Secretariat, the Secretary (Legislative Department), the Secretary & a few Senior Officers of the Ministry of Statistics and Programme Implementation, and the State / UT … Continue reading Free E-Book on the Collection of Statistics Act, 2008