"మాలిక" అంటే మాల, వరుస, దొంతర, పరంపర, సరణి - ఇత్యాది అర్థాలు ఉన్నాయి. సంగీతంలో రాగమాలిక అన్న ప్రక్రియ ఉంది. వివిధ రాగాలను వరుసగా మార్చుకుంటూ ఒకే పాట లేదా కృతి లోని చరణాలను పాడటం దీని లోని ప్రత్యేకత. ఒక రాగంలో పాడుతూనే, పాట లోని వివిధ భాగాలకు వేర్వేరు తాళాలను మార్చి పాడే పద్ధతిని తాళమాలిక అంటారు. "పద్యమాలిక" అంటే పద్యాల వరుస అని సామాన్యమైన అర్థము. తెలుగు ఛందస్సులో "పద్యమాలిక" అంటూ … Continue reading పద్యమాలిక
Category: పద్యాలు
సమస్యాపూరణాలు -I
01 - 09 - 2025న ప్రచురించిన "సమస్యాపూరణాల సమాహారం" అన్న నా పుస్తకంలో(Free E-Book), 456 సమస్యలకి నేను చేసిన 620 పూరణలు ఇవ్వబడ్డాయి. ఆ తరువాత పూరించిన సమస్యలు పుస్తక రూపంలో ఒక్కసారిగా ప్రచురించే ముందు ఇలా ఎప్పటికప్పుడు ఈ బ్లాగులో మీ ముందు ఉంచాలని అనుకున్నాను. ఈ భాగంలో 10 సమస్యలకి పూరణలు ఇవ్వబడ్డాయి. 1. సమస్య: బలరాముడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్ కం. చెలు లన యతడే దారిని శిల … Continue reading సమస్యాపూరణాలు -I
గొడుగు
కం. అడుగిడెను వామ నుండుగ, గొడు గొక కేల్బట్టి హోమగుండముఁ గడకున్, యడిగెను మూడడుగుల యిల, యడఁచగ బలి దుడుకు విష్ణు వతడని తెలిసెన్. … 1 (అడుగిడు = పాదముపెట్టు, కేలు = చేయి, హోమము = యజ్ఞము, గుండము = నిప్పులగుంట, కడ = సమీపము, ఇల = నేల, అడఁచు = అణచు, దుడుకు = గర్వము) యజ్ఞగుండము సమీపంలో గొడుగు ఒక చేత్తో పుచ్చుకొని వామనుడిగా పాదం పెట్టాడు. మూడు అడుగుల … Continue reading గొడుగు
భగవద్గీత
1. ఉ. కౌరవ సైన్యమందు గల గౌరవనీయుల జూచి, పార్థుడు గ్రారు లహం బడంచు తన గాండివమున్ జెయి జార్చి, నేనికన్ గోరను, భ్రాత్రు రక్తమును గ్రోలి జయించిన యట్టి రాజ్యమున్, ఈ రణ మేల నిప్పుడన, కృష్ణుడు వానితొ యప్పు డిట్లనెన్. కౌరవ సైన్యంలో ఉన్న పూజనీయులైన వ్యక్తులను చూసి, అర్జునుడు భయంకరమైన శత్రువుల గర్వాన్ని అణచే తన గాండీవ ధనుస్సును చేతినుండి జార్చి, నేను ఇక అన్నదమ్ముల రక్తము త్రాగి గెలిచే రాజ్యం కోరను, … Continue reading భగవద్గీత