యుద్ధం చెయ్యాలనుకొని ఒక చోట చేరిన మా వాళ్ళున్నూ పాండవులున్నూ ఏం చేశారు అని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగిన ప్రశ్నతో భగవద్గీత లోని మొదటి అధ్యాయమైన అర్జున విషాద యోగము మొదలవుతుంది. ఆ తరువాత దుర్యోధనుడు ద్రోణాచార్యునికి కొన్ని జాగ్రత్తలు చెప్పటం, వీరులందరూ తమ తమ శంఖాలు ఊదడం, అప్పుడు అర్జునుడు కోరగా సారథియైన కృష్ణుడు రథాన్ని రెండు సేనల మధ్య నిలపడం, అర్జునుడు అందరినీ చూసి, స్వజనాన్ని చంపాలా ఇప్పుడు నేను, అని దుఃఖించడం, తన … Continue reading భగవద్గీత – అర్జున విషాద యోగము
Category: Articles
భగవద్గీత గురించి – మంచి, చెడు
భగవద్గీత గురించి - మంచి, చెడునా చిన్నప్పుడు మా గురువుగారు (తాతగారు) భగవద్గీత శ్లోకాలు పారాయణ చేస్తుంటే, అవి వినీ వినీ కొన్ని నాకు కూడా కంఠతా వచ్చేశాయి. అది గ్రహించి వారు ఆ తరువాత నాకు క్రమ పద్ధతిలో భగవద్గీత భట్టీయం వేయించారు. అది భట్టీయమే. ఎందుకంటే, అప్పుడూ ఇప్పుడూ కూడా నాకు సంస్కృతం రాదు. అలా భగవద్గీతతో మొదలైన నా అనుబంధం, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పెద్దయిన తరువాత భగవద్గీతపై వ్యాఖ్యానాలు, టీకా తాత్పర్యాలు, … Continue reading భగవద్గీత గురించి – మంచి, చెడు
ఎక్కడైనా ఇమడటం ఎలా?
చిన్నప్పటి నుండి ఇతరులతో, ముఖ్యంగా కొత్తవాళ్ళతో, కలవడం అలవాటైన వాళ్ళకి ఎక్కడైనా ఇమడటం పెద్ద కష్టం కాదు. కానీ అందరికీ అలా ఉండదుగా. నా మాట కొస్తే, 14 ఏళ్ళ వయస్సు వచ్చేవరకు జిల్లా సరిహద్దులు దాటలేదు. అప్పటి వరకు రైలు ప్రయాణం కూడా ఎరగను. చెప్పులు వేసుకోవడం అలవాటు కాకపోవడం వల్ల, ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్పులు కొన్నా, వారం తిరక్కుండా వాటిని ఎక్కడో పారేసుకుంటూ ఉండడం వల్ల, అటు చేసి ఇటు చేసి 14 ఏళ్ళ … Continue reading ఎక్కడైనా ఇమడటం ఎలా?
కథలలో లిష్టులు
కథలలో లిష్టులు (lists) ఏమిటి, ట్విష్టులు (twists) కదా ఉండాల్సింది అని అనుకుంటున్నారా. అదే గమ్మత్తు. అయితే ఈ గమ్మత్తు చేసింది ఎవరు అనే ప్రశ్న ఉదయిస్తుంది. అసలు లిష్టులు అంటే వాటిల్లో ఏముండాలి? మనం చెప్పే కథకి వాటికి లింకు (link) ఏమిటి? ఈ ప్రశ్న లన్నిటికీ మన సాహిత్యంలో దొరికే కొన్ని సమాధానాలు చూద్దాం. అసలు మన ఆదికావ్యమైన వాల్మీకి రామాయణం ఒక లిష్టుతోనే మొదలవుతుంది. వాల్మీకి మహర్షి నారదుడికి 16 గుణాల లిష్టు … Continue reading కథలలో లిష్టులు
తెలుగు భాష వ్యాకరణాల ప్రాముఖ్యత
తెలుగు భాష వ్యాకరణాల ప్రాముఖ్యతమనకి తెలుగులో గసడదవాదేశ సంధి, సరళాదేశ సంధి (అంటే, గజడదబాదేశ సంధి) అన్న రెండు హల్ సంధులున్నాయి. రెండవ పదంలో ఉన్న కచటతపలకి ఈ రెంటిలో ఏవి ఆదేశాలవుతాయో చూడంగానే అర్థమవుతుంది. గసడదవాదేశ సంధిలో మొదటి పదం ప్రథమా విభక్తి (డు, ము, వు, లు) అయి ఉంటే, సరళాదేశ సంధిలో మొదటి పదం ద్రుత ప్రకృతికం (చివర 'న్' లేదా 'న' ఉండేది) అయి ఉంటుంది. ఈ వ్యాకరణం పరమానందయ్య లాంటి … Continue reading తెలుగు భాష వ్యాకరణాల ప్రాముఖ్యత
వన్ అప్ ఎఫిషియన్సీ
వన్ అప్ ఎఫిషియన్సీ (one-up efficiency) అంటే ఎప్పటి కప్పుడు ఇతరుల కన్నా తాను కాస్త మెరుగు అని అనిపించుకోవడం, పనికొచ్చే పనిలోయైనా సరే పనికిరాని పనిలోయైనా సరే. మా చిన్నప్పుడు మా నాన్నగారు మమ్మల్ని నవ్వించడానికి చెప్పిన ఒక కథ దీన్ని చాలా బాగా వివరిస్తుంది అని నాకు పెద్దయిన తరువాత తెలిసింది. శ్రీరామచంద్రుడు రావణ సంహారం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చి అందరి సమక్షంలో పట్టాభిషిక్తుడవుతాడు. అందరి సమక్షంలో అంటే, తన అన్నదమ్ములు, తన … Continue reading వన్ అప్ ఎఫిషియన్సీ
యది హాస్తి తదన్యత్ర – మన టీవీ కార్యక్రమాలు
చాలా కాలం క్రితం శ్రీశ్రీ గారు సినిమాల గురించి ఎక్కడో ఒక ఇంటర్వ్యూ (interview) లో అన్న మాటలు నాకు ముందుగా గుర్తు చేసుకోవాలని ఉంది. ".... అసలు ఉత్తమ చిత్రాలు నిర్మిస్తే మన ప్రజలు చూడరని చెప్పడం కూడా మన ప్రొడ్యూసర్లకి పరిపాటి అయ్యింది. ఇది ఎంత అసందర్భంగా వున్నదో చెబుతా వినండి. ప్రతివాడూ తిండి కోసం హోటలుకి వెళ్ళాలి. అతడికి ప్రతిసారీ ఆహారం (మంచిది) లభించక పోవచ్చు. అయినా రోజూ హోటలుకి వెళ్ళక తప్పదు. … Continue reading యది హాస్తి తదన్యత్ర – మన టీవీ కార్యక్రమాలు
ఆయన తిట్టినా మనకి కోపం రాదు
కొంత మంది తిట్టినా ఎవ్వరికీ కోపం రాదు. వాళ్ళ పెద్దరికం అలాంటిది. అటువంటి వాళ్ళలో అగ్రగణ్యులు శ్రీ కాళ్ళకూరి నారాయణరావు (1871 - 1927) గారు. వీరు ఇంచుమించు తమ సమవయస్కులైన టంగుటూరి ప్రకాశం పంతులు గారితో పాటు ఆ రోజుల్లో నాటకాలు వేసే వారట. పంతులు గారు గుండ్రటి ముఖం కలవారు కాబట్టి నాయిక దమయంతి గాను, నారాయణరావు గారు నాయకుడు నలుడు గాను వేషం కట్టేవారట. ఆ విషయం పక్కన పెడితే, నారాయణరావు గారు … Continue reading ఆయన తిట్టినా మనకి కోపం రాదు
విద్యాలయాల్లో నా వింత అనుభవాలు
విద్యాలయాల్లో నా వింత అనుభవాలు ఎక్కువగా విద్యార్థులకి ఫాకల్టీ (faculty) లకి సంబంధించినవి. వీటిల్లో కొన్ని విన్నవి, కొన్ని స్వానుభవం లోనివి. కొన్ని మంచివి కొన్ని చెడువి. రెంటిలోనూ నేర్చుకునే విషయాలు ఉంటాయని నా నమ్మకం. విద్యాలయాల్లో జరిగిన తగాదాల గురించి నేను వ్రాయడం లేదు. ఎందుకంటే, అందులో నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదని నా అభిప్రాయం. నాతో పోలిస్తే తోటి విద్యార్థులలో చాలా పెద్దవాళ్ళు ఉండడం అనేది నాకు 6వ క్లాసులోనే మొదలయ్యింది. నేను 8 ఏళ్ళ … Continue reading విద్యాలయాల్లో నా వింత అనుభవాలు
మన యూనియన్లు, అసోషియేషన్లు
యూనివర్సిటీ (University) లో సీటు వచ్చిందని తెలియగానే చేరడానికి వెళ్ళి ప్రవేశ రుసుం (Admission fee) కట్టడానికి క్యూ (Queue) లో నిలబడతాము. డబ్బు కట్టిన తర్వాత, ఒక రసీదు (receipt) ఇస్తారు కదా. దానిలో ట్యూషన్ ఫీజు (Tution fees), లైబ్రరీ ఫీజు (Library fees), ఇంకా ఇతర ఫీజులు కాక స్టూడెంట్స్ యూనియన్ ఫీజు (Students Union Fees) అని పది రూపాయలో ఇరవై రూపాయలో (ఎంతైతే అంత) వసూలు చేసినట్లుగా ఉంటుంది. ఏదో … Continue reading మన యూనియన్లు, అసోషియేషన్లు