శ్రీ రామభద్ర శతకము

మా గురువుగారు కీ.శే. శ్రీ చిరువోలు దుర్గాప్రసాదరావు గారు రచించిన “శ్రీ రామభద్ర శతకము” 06-10-2025న ఈ-బుక్ (E-Book) గా ఈ క్రింది లింకులో పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు. ఈ శతకం మీద మీరు సూచనలు/ వ్యాఖ్యలు ఇవ్వడానికి ఈ బ్లాగులో సదుపాయం ఉంది. ఉపయోగించుకోగలరు.

https://ia600209.us.archive.org/35/items/shri-ramabhadra-shatakamu-free-e-book_20251006/Shri%20Ramabhadra%20Shatakamu%20Free%20E-Book.pdf

One thought on “శ్రీ రామభద్ర శతకము

  1. శ్రీ చిరువోలు విజయ నరసింహారావు గారు, న్యూఢిల్లీ, 08-10-2025న పంపిన అభినందన పద్యాలు క్రింద ఇవ్వబడ్డాయి:

    తే.గీ. శాస్త్ర సమ్మత మొప్పగా శతకములను

    సవరణల నన్ని – గురుభక్తి శ్రద్ధ తోడ

    పూర్తి యొనరించి, ధన్యతఁ బొందినావు,

    శ్లాఘనీయుడ వైతి నీ శాస్త్ర (శస్త) ప్రజ్ఞ.                  … 1

    తే.గీ. పట్టికల పొందుపఱచగ పట్టు కలుగ

    ఛందముల, యతి, ప్రాసల, చందములను

    ప్రజ్ఞఁ బడసితి, విజ్ఞాన ప్రతిభఁ జూపి,

    దాన, పఠితులకు సులభతరముఁ గాగ,

    వారి యరచేతి యుసిరిక పగిది యయ్యె.               … 2

    తే.గీ. పదముల ప్రయోగ చాతుర్య ముదితు డగుచు

    తగ పరిష్కరించితి వీవు, ధన్యుడ వయి

    ఖ్యాతిఁ బడయంగ సంతోషకరము కాదె!

    ఆయురారోగ్య విజ్ఞాన మమరుఁ గాక!

    భావి బహు గ్రంథ కర్తవై పఱగుఁ గాత!                   … 3

    శుభమస్తు!

    Like

Leave a reply to Ranganadham Cancel reply