నేను రచించిన “నా తెలుగు వ్యాసావళి” అన్న పుస్తకం 18-09-2025న ఈ క్రింది లింకులో పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు. ఈ పుస్తకం మీద, మీరు సూచనలు/ వ్యాఖ్యలు ఇవ్వడానికి ఈ బ్లాగులో సదుపాయం ఉంది. ఉపయోగించుకోగలరు.
My thoughts
నేను రచించిన “నా తెలుగు వ్యాసావళి” అన్న పుస్తకం 18-09-2025న ఈ క్రింది లింకులో పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు. ఈ పుస్తకం మీద, మీరు సూచనలు/ వ్యాఖ్యలు ఇవ్వడానికి ఈ బ్లాగులో సదుపాయం ఉంది. ఉపయోగించుకోగలరు.
క్రింద ఇచ్చిన సందేశం “కాటూరివారి పౌలస్త్య హృదయము” అన్న వ్యాసం గురించి 14-07-2021న లక్కరాజు ఇందిర గారు (ఈ వ్యాసం ఎవరికైతే అంకితం ఇచ్చానో ఆ కీ.శే. లక్కరాజు శ్రీనివాసరావు గారి పెద్ద కుమార్తె) పంపినది:
కీ.శే. కాటూరి వేంకటేశ్వరరావు గారి పౌలస్త్య హృదయం – ఖండ కావ్యంపై మీరు రాసిన వ్యాసం హృద్యంగా ఉంది. ఈ వ్యాసంలోని విషయాలని కీ.శే. లక్కరాజు శ్రీనివాసరావు గారి (మా నాన్న గారి) ద్వారా విన్నానని, 44 వత్సరాల క్రితం విన్న విషయాసక్తితో – పౌలస్త్య హృదయాన్ని కూలంకషంగా చదివి, వివిధ ప్రచురణలను సేకరించిన మీ సాహిత్యాభిలాష అభినందనీయం. ఈ వ్యాసాన్ని మా తండ్రిగారికి అంకిత మిచ్చిన మీ గురుభక్తికి వినమ్ర ప్రణామాలు. మిక్కిలి శ్రద్ధాసక్తులతో 39 పద్యాల విశ్లేషణ – వచనరూప వివరణ – మాబోటి సామాన్య పాఠకులకి అవగతమయ్యేలా అందించారు. కావ్యం మూలాల్లోకి వెళ్ళి – వస్తుసేకరణ ద్వారా వివిధ అంశాల వివరణ, విశ్లేషణ – రచనా కాలాన్ని గ్రహించిన మీ విషయాసక్తి అభినందనీయం.
పౌలస్త్య హృదయం – రావణుడి వైరభక్తికి నిదర్శనం. సముద్రుడితో – స్వగతంగా – రావణుడి అంతరంగ ఆవిష్కరణ కళ్ళకు కట్టినట్లుగా – విజువలైజ్ (visualize) చేశారు. ఈ ఖండ కావ్యం మహాకవి కాటూరి వేంకటేశ్వరరావు గారి “కాల్పనిక” – శైలికి మచ్చుతునక. రామాయ, రామభద్రాయ, రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ, సీతాయాః పతయే నమః – ఇన్ని పేర్లతో పిలవబడే శ్రీరామచంద్రుని చేతిలో మరణాన్ని ఆహ్వానిస్తున్న రావణుడి వైరభక్తి ప్రస్ఫుటమైంది.
1వ పద్యంలో వ్యాస విశ్లేషణ – లోకరీతిని తెలియజేస్తూ –
2వ పద్యంలో – మనస్సులోని భయాన్ని గాంభీర్యంగా ప్రదర్శిస్తున్న తీరు –
3వ పద్యంలో రావణుడి మనస్సులోని భయానికి – ప్రకృతిని ఛాయామాత్రంగా చెప్పటం – షేక్స్పియర్ (Shakespeare) మాక్బెత్ (Macbeth) నాటకీయతని ప్రతిబింబిస్తోంది.
4, 5 పద్యాలలో – శత్రువుకి అహ్వానం పలకటం – వీరోచితం –
6, 7 పద్యాలలో – గతస్మృతులను పునరావలోకనం చేసుకోవటం –
8, 9 పద్యాలలో – శ్రీరాముడిని ఆగ్రహింప చేయడానికి తాను ఏఏ పనులు చేశాడో – వివరణాత్మకంగా విపులీకరించారు.
10, 11 పద్యాలలో – రాముడి శోకవర్ణన – తనను విస్మరించాడు రాముడని రావణుని వేదన – “నన్ను మరచివిభుడు” అనటం – వైరభక్తికి పరాకాష్ఠ.
12, 13, 14 పద్యాలలో – రావణుడి దుష్టకార్యాలు – రాముడి దృష్టిని ఆకర్షించడానికి చేసిన పనులు – సామాన్య శైలిలో వివరించిన తీరు బావుంది.
15, 16, 17 పద్యాలలో – మానవ ప్రవృత్తి, లోకరీతి, రావణుడి చేత స్వామిద్రోహం – సీతాపహరణం – వివరణ సార్వజనీనంగా ఉంది.
18, 19, 20 పద్యాలలో – నవవిధ భక్తిమార్గాలు – రావణుడికి నచ్చక పోవటం – కొత్తమార్గంలో భగవంతునికి వైరిగా – వైరభక్తి ద్వారా స్వామిని చేరాలని – “కల సకలాధ్వముల్ ….” వ్యాసకర్త ఐచ్ఛికాన్ని ప్రతిఫలిస్తొంది.
21వ పద్యంలో – రావణుడి స్వాతిశయం – ఈ పద్యాన్ని మా నాన్నగారి నోటివెంట పలుమార్లు విన్న అనుభూతిని – వ్యాసకర్త రంగనాధంగారి ద్వారా గుర్తు చేసుకుంటున్నాను.
22, 23, 24 పద్యాలలో – స్వామి పరాక్రమ వర్ణనలో – స్వామిభక్తి ప్రకటన – బావుంది.
25, 26 పద్యాలలో – రాముని అందచందాల వర్ణన – అద్భుతం – “పుంసాం మోహనరూపాయ” –
27, 28 పద్యాలలో – సముద్రుడి ధన్యత – 28లో తోయధీ ధన్యుడవు నీవు – స్వజనం అందరి కంటే – “నేనే” ఎక్కువ మక్కువ అని రావణుడు ప్రకటించుకోవటం – బావుంది.
29, 30, 31 పద్యాలలో – ఆశ్రిత జనబాంధవుడైన – నా స్వామిని చూసే భాగ్యం – సీతాపహరణం వలన దక్కిందనుకోవటంలో – ద్వైదీభావన ప్రకటితమైంది.
32, 33, 34 పద్యాలలో – అవతారపురుషుడు రాముని – చంద్రహాస ఖడ్గానికి “మేటి పండుగ” అనటం – రావణునికి మాత్రమే సాధ్యం. వీరవ్రతానికి పరాకష్ఠ.
35, 36, 37 పద్యాలలో – నిరాయుధునిగా వచ్చే స్వామికి తన చేతులు ఆయుధాలుగా ధరింప చేస్తాననడం – భక్తి పారవశ్యానికి పతాక స్థాయి.
38, 39 పద్యాలలో – “రాముని రాకకై” “విరహాగ్నిగ్రాగు” – అనటంలో పరిపూర్ణ భక్తి – unconditional surrender to God.కాటూరి వారి శైలిని – 39 పద్యాలలోని పౌలస్త్య హృదయం – ఖండకావ్య నిశిత పరిశీలన చేసిన వ్యాసకర్త, మిత్రులు – శ్రీ రంగనాధంగారికి – సాహిత్యాభినందనలు. వ్యాసం ముగింపులో మీరు పద్యరూపంలో సమర్పించిన పద్యకుసుమాంజలి ఈ ఖండకావ్యానికి కవి పట్ల మీ భక్తితత్పరతని చాటాయి. మన దైనందిన జీవితంలో ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు మనకి తారస పడతారు. చాలా విషయాలు తెలుసుకుంటాము. 4 దశాబ్దాల క్రితం విన్నవి, స్మృతిపథంలోని విషయాలకి మనోజ్ఞమైన అక్షర రూపాన్ని ఇచ్చి – కావ్యానికి పునఃప్రాణప్రతిష్ఠ చేశారు మీరు. మీ ఈ ప్రయత్నం శ్లాఘనీయం. మీరు మరిన్ని పరిశీలనా వ్యాసా లందించాలని ఆకాంక్షిస్తున్నాను. ఇంత శ్రమకోర్చి చేసిన – మీ సాహితీప్రక్రియారూపాన్ని మా తండ్రిగారు – కీ. శే. లక్కరాజు శ్రీనివాసరావు గారి స్మృతికి అంకితమిచ్చిన – మీకు సాహితీ ఋణగ్రస్తులం.
LikeLike
శ్రీ చిరువోలు విజయ నరసింహారావు గారు 28-06-2021న “పౌలస్త్యహృదయం” అన్న వ్యాసం మీద తన స్పందనగా కాటురి కవిని సన్నుతిస్తూ పంపిన పద్యాలు క్రింద ఇవ్వబడ్డాయి:
1. కం. పౌలస్త్యహృదయ రచనము
వైలక్షిత భావయుక్త వైదుషి వెలయన్
తా లక్షించిన గమ్యము
నే, లభియించ కృషి సల్పి నేర్పునుఁ జూపెన్.
2. కం. గురువుల బోధలు, పాండితి
సరస రచనమును ప్రతిభయు సమకూర్చన్, తా
నిరతము శుష్రూషారతి
వర విఖ్యాతిన్ గడించి వర్ధిలి రనఘుల్.
3. కం. ప్రతి పదమది సుమధురమై
ప్రతి ఘట్టము కనులఁ గనగ ప్రత్యక్షంబై
ప్రతిపాదిత ప్రాయోజిత
ప్రతిభా ప్రకటిత విశేష భావ్యం(గ్యం) బయ్యెన్.
4. కం. కాటూరి వేంకటేశ్వర!
ఘాటుగ కవితల్ వెలార్చి ఖ్యాతిం గనగా
దీటుగ నిల్చెద రెవరో?
మాటల నర్థము ఘనతర మాన్యత వెలయున్.(చాటించెద నీదు కీర్తి సభలన్ జగతిన్)
LikeLike
“ప్రసిద్ధమైన సినిమా పాటైన మొల్ల కల్పన” అన్న వ్యాసం గురించి:
1. శ్రీ గోనుగుంట మురళీకృష్ణగారి స్పందన (సంచిక వెబ్ మాగజిన్లో 13-04-2025న): “ప్రసిద్ధమైన సినిమా పాటైన మొల్ల కల్పన”లో మంచి పద్యం గుర్తు చేశారు రచయిత. అదొక్కటే కాదు, మొల్ల రామాయణంలో ప్రతి పద్యమూ ఆణిముత్యమే. హనుమంతుడు తను రామదూతని అని చెబితే మొదట నమ్మదు సీతమ్మ. “రాముడిని నువ్వు నిజంగా చూసినట్లయితే ఎలా ఉంటాడో చెప్పు” అని అంటుంది. రాముడి ఆకారాన్ని వర్ణించే శ్లోకాలు ఒక ఇరవై దాకా ఉన్నాయి వాల్మీకంలో. అవి అన్నీ ఒకే పద్యంలో చెబుతుంది మొల్ల, “నీలి మేఘచ్ఛాయ బోలు దేహము వాడు, ధవళాబ్జపత్ర నేత్రముల వాడు, …” అనే పద్యంలో. ఆ పద్యం భావాన్ని తెలియజేసే పాట ఉంటుంది ‘కథానాయిక మొల్ల’ సిమిమాలో “నీలజలద రమణీయ రూపం, నిగమాంచల మందిర మణిదీపం …” అంటూ. పౌరాణిక చిత్రాల పాటలు అన్నిటికీ ప్రాచీన కావ్యాలే స్ఫూర్తి.
2. డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారి స్పందన వాట్సప్ ద్వారా (06-04-2025): అహల్యా శాపవిమోచనం కథ గురించిన విశేషాలు బాగున్నాయి. అహల్యను ఇంద్రుడు మోసం చేశాడని తెలుసు. వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండటం చూసి ఆగ్రహంతో గౌతమ మహర్షి ఆమెకు శాపమిచ్చాడని తెలుసుగానీ దేవతల దేవుడు ఇంద్రు డంతడివాడు అడిగాడని ఆమె ఇష్టపూర్వకంగానే గౌతమునితో సంగమించిందన్నది నాకు తెలియని కొత్త పాయింట్. ఇక ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఎంత సహజసుందరంగా అలతి అలతి మాటలతో రాసాడు కవి అని అనుకునేదాన్ని. మొల్ల రామాయణం లోని విషయాన్ని తీసుకొని ఆ పాటలో ఉపయోగించుకోవటం గ్రేట్ కదా నిజంగా. మీ సూక్ష్మ పరిశీలనాశక్తి, ఏ రామాయణంలో ఏం చెప్పారు అన్న తులనాత్మక పరిశీలనాసక్తి మెచ్చుకోదగినవి.
LikeLike
“భవిష్యవాణి తెలుసుకోవడం మంచిదా?” అన్న వ్యాసం గురించి సంచిక వెబ్ మాగజిన్లో వచ్చిన స్పందనలు:
1. శ్రీ గోనుగుంట మురళీకృష్ణగారి స్పందన (09-03-2025న): భవిష్యవాణి తెలుసుకోవడం మంచిదా కాదా అని ఒక కొత్త ఆలోచన రేకెత్తించి అందుకు సోదాహరణంగా ధర్మరాజు చేసిన పనులు వివరించారు రచయిత. బాగుంది. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింటు గుర్తుంచుకోవాలి. భవిష్యవాణి అంటే భవిష్యత్ లో జరగబోయేది సూచనప్రాయంగా చెబుతారు గానీ, పూస గుచ్చినట్లు మొత్తం చెప్పరు. అందుకే ధర్మరాజు వివిధ సందర్భాలలో ఆయా సందర్భాలకు అనుగుణంగా వ్యవహరిస్తాడు. భీష్ముడికి కూడా జరగబోయేది తెలుసు. కానీ చెప్పకూడదు. వారించే ప్రయత్నం మాత్రమే చేస్తాడు.
2. డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారి స్పందన (11-03-2025న): భవిష్యవాణి ఆర్టికల్ చాలా ఆసక్తికరంగా ఉంది. పురాణ కథల ఉదాహరణలతో బాగా చెప్పారు. నా కేమనిపిస్తుందంటే భవిష్యత్తు గురించి ముందుగా తెలవకపోవడం అనేది మనిషికి ఆ దేవుడిచ్చిన వరం అని. మరణం గురించి అస్సలు తెలవకూడదు. తెలిస్తే ఎప్పుడో ఒక్క సారి చావాల్సింది భయంతో రోజూ చస్తూ బ్రతుకుతుంటాడు మనిషి. అందుకే మురళీకృష్ణ గారు అన్నట్లు మరణం గురించి ఏ జ్యోతిష్కుడూ చెప్పడు. మంచి చెడులు ఈ రెండింటిలో దేని గురించి ముందుగా తెలిసినా మనిషి ప్రవర్తన, ఈ లోకం, ఇలా అస్సలు ఉండవు అన్నది నిజం. కనుక తెలియకపోవడమే మంచిది.
3. శ్రీ బర్కత్ అలీ గారి స్పందన (11-03-2025న): భవిష్యత్తు గురించి ముందుగానే తెలియడం మంచిదా కాదా అనే దాని గురించి సోదాహరణముగా మహాభారతమును ఉటంకిస్తూ చాలా అసక్తికరముగా వివరించినారు రచయిత. జరగబోయేదాని గురించి ఆలోచించకుండ కర్మపై, సమయం మీద, వదిలి అంతా మంచి జరుగుతుంది అనే భావనతో జీవించడం ఉత్తమము.
4. Views of Dr. Srinivasa Rao, Ph.D (on 11-03-2025): Good article on a complex topic. Information should be used properly for good results. Information itself is neither good nor bad.
5. Views of Sri Krishna (on 11-03-2025): Very interesting perspective. The purpose of life is to live as it unfolds. If we always knew what would happen next, life would lose its charm. When we believe in karma, we trust that outcomes are destined and remain unchanged. Joy lies in learning, growing, and doing our best. Knowing the future takes away the excitement. Curiosity is what keeps life interesting. Focus on your efforts and leave the results to destiny. Karma always balances in the end.
6. Views of Sri M.B.R. Sastry (on 14-03-2025): A good attempt to explain the readers that peeping into our future will lead to many evils. For better explanation, the author has taken Mahabharata and, in a nutshell, narrated all the incidents that have happened chronologically. The very fact that we don’t know what happens every moment is the secret of the creation. Astrology can’t be considered as a science. But, it is true that if someone believed some astrologer, it will be end of his peace.
7. Views of Sri D. Tirupathi Sastry (on 15-03-2025): I strongly feel that there is nothing wrong to observe or to know and implement what is going to happen in future if we believe “Bhavishya vani”. The reasons being just as the deficiencies in the human body are corrected by supplying vitamins, proteins and minerals etc., the spiritual deficiencies of the soul in life time can be cured by means of corrective action and supply of spiritual inputs of some births. Of course, it is to be kept in mind that nobody can alter or avoid what has been ordained by fate.
LikeLike
“నా గురువు నా కల్ప తరువు” అన్న వ్యాసం గురించి సంచిక వెబ్ మాగజిన్లో వచ్చిన స్పందనలు:
1. Views of Sri D. Tirupathi Sastry (on 05-01-2025): GURU as per advaya Upanishad is dispeller of darkness and you are blessed to have guru like late Shri Chiruvolu Durga Prasada Rao garu in your life. Guru is the supreme cause and ultimate destiny. You are fortunate to have made Sishrusha to such a learned guru which, I feel, led you to such a high position in society.
2. Views of Dr. Smt. Rajeswari Kasturi (on 06-01-2025): Excellent write-up and tribute to Gurugaru. Blessed to know about such a great Gurugaru. The article is a guidance for principles and values to be imbibed in life. My father also liked your sincere expression of your beloved Gurugaru. It has brought back memories of his childhood learning days.
3. శ్రీ గరిమెళ్ళ శాస్త్రి గారి స్పందన (28-01-2025న): బహుముఖ ప్రజ్ఞాశాలులుగా పిల్లలను తీర్చి దిద్దాలి అంటే ముందు వారు (గురువు గారు) బహుముఖ ప్రజ్ఞాశాలి అయ్యి ఉండి ఉండడము ఒక గొప్ప విషయం. ఆణిముత్యం మీ గురువు గారు. వారి ప్రతిభా పాటవాల గురించి, వారు మిమ్మల్ని తీర్చిదిద్దిన తీరు గురించి స్పష్టంగా అభివర్ణించిన తీరు చాలా అద్భుతంగా ఉంది.
4. డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారి స్పందన (06-01-2025న): మీ కిష్టమయిన మీ గురుదేవుల గురించి మీరు అభిమానంగా, పూజ్యభావంతో వ్రాసిన అర్టికల్ చాలా బాగుంది. ఆ కాలంలో గురువులు ఎలా ఉండే వారో కదా అనిపించి నేనూ గతంలోకి వెళ్ళిపోయాను. మంచి గురువు లభించడం మీ అదృష్టం. అలాగే మీ లాంటి శిష్యుడు లభించడం వారికీ ద్రోణాచార్యునికి అర్జునుడు లభించినట్లే. బాగుంది మీ గురుశిష్య బంధం. ఇలాంటి వ్యాసాలు ఈ కాలం పిల్లలకు అవసరం. (గురువులకు కూడా అనాలేమో)
5. డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారి స్పందన వాట్సప్ ద్వారా (23-10-2024): అబ్బ, ఎంత గొప్పవారండీ మీ గురువుగారు. నిజంగా మీ కల్పతరువే. మీరు చాలా అదృష్టవంతులు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా పండితులు, పాఠాలతో పాటు వ్యక్తిత్వ వికాస పాఠాలను కూడా నేర్పే వారు మీ గురువులు అన్న మాట. చింత గింజలతో లెక్కలు, వేళ్ళ మీద లెక్కింపులు, కూడికలు, తీసివేతలు, భట్టీయాలు – ఇవన్నీ ఎంత గట్టి చదువులు. ఇప్పుడు వేలకు వేలు నోట్ బుక్స్ కి ఖర్చు పెట్టినా వోటు చదువులే. అందుకే మీలో అంత జ్ఞానం. పురాణాల గురించి కొత్తరకం దృక్పథపు వ్యాఖ్యానాలు మీ గురువు గారివి బాగున్నాయి. మంచి గురువు ప్రభావం మన మీద మన జీవితాంతం ఉంటుంది. ఈ మీ రచనను ఒక్కసారి ఇలా చదివితే సరిపోయేలా లేదు. మళ్ళీ మళ్ళీ చదవాలి. చదువుతాను.
LikeLike
“గర్భ కవిత్వం వ్రాయడం ఎలా?” అన్న వ్యాసం గురించి సంచిక వెబ్ మాగజిన్లో వచ్చిన డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారి స్పందన (17-11-2024న):
ఛందస్సు చదువుకున్నాను. పాఠం చెప్పాను గాని ఛందోబద్ధంగా పద్యాలు వ్రాయడం రాదు నాకు. ఇంక గర్భ కవిత్వం ఏమొస్తుంది, మీ వ్యాసాన్ని చదివి ఆనందించటం తప్ప. అదే పని చేశాను. మంచి ఫీల్ కలిగింది. ఆ కాలం కవులు ఇలా పదాలతో ఎన్నో వ్యూహాలు పన్ని పద్యాలూ వ్రాసి పద్మవ్యూహం, గరుడ వ్యూహం అంటూ చిత్ర విచిత్ర కవిత్వం అల్లారు. ఆ ఉత్కృష్ట రచన అంతరించిపోయింది అనుకుంటున్న సమయంలో మీలాంటి అతి కొద్ది మంది కవులు వారసులుగా ముందుకు వచ్చి “లేదు” అంటూ మన ప్రాచీన సాహితీ సాంప్రదాయాన్ని నిలబెడుతున్నారు.
LikeLike
“కాటూరివారి పౌలస్త్య హృదయము” అన్న వ్యాసం గురించి సంచిక వెబ్ మాగజిన్లో వచ్చిన స్పందనలు:
1. డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారి స్పందన (01-11-2024న): బాగుంది పౌలస్త్య హృదయం. దీని గురించి విన్నాను గానీ ఇంత విపులంగా, ఈ పుస్తకంలో ఏమున్నది అన్నది, ఈ మీ వ్యాసం ద్వారానే తెలిసింది. నవవిధ భక్తులు తెలుసు గాని వైరభక్తి గురించి ఇంత విస్తారంగా ఇప్పుడే తెలిసింది. రామాంజనేయ, కృష్ణార్జున యుద్ధఘట్టాలలోని పూర్వ కథలలో ఈ వైరభక్తి ఛాయలు కనిపిస్తాయి గాని రావణుని వైరభక్తి మాత్రం భలేగుంది. కథానాయకుని గుణగణాలు లోకప్రసిద్ధం కావాలంటే ప్రతినాయకుని పాత్రచిత్రణ కూడా బాగుండాలి. ఇందులో “మంచి అంతా ఆయనకే దక్కనీ ..” మాటల అంతరార్థం అదే అనిపించింది. తనని తాను రావణుడు స్వగతంలో సమర్థించుకోవటంలో కూడా కవి కాటూరి వారు ఔచిత్యాన్ని బాగానే పోషించారు. మొత్తానికి వెరైటీ అర్టికల్. మీరు ఇచ్చిన పద్య ఉదాహరణలు చూశాక తెలిసింది ఇది ఎంత సరళ సుందర వైవిద్యభరిత కావ్యమో.
2. శ్రీ గోనుగుంట మురళీకృష్ణగారి స్పందన (03-11-2024న): “పౌలస్త్య హృదయం”లో రావణుని వైరభక్తి గురించి చాలా విపులంగా, పద్యాలతో బాగా వివరించారు. రిఫరెన్స్ గా భద్రపరచుకోవలసిన వ్యాసం ఇది. ఈ కథ చిన్నప్పుడు రేడియోలో ఏకాంకికగా విన్నట్లు గుర్తు. పింగళి, కాటూరి వారలదే కావచ్చు.
LikeLike
“రామాయణంలో కరప్షను (corruption) అనగా అవినీతి కథ” అన్న వ్యాసం గురించి సంచిక వెబ్ మాగజిన్లో వచ్చిన స్పందనలు:
1. Views of Sri D. Tirupathi Sastry (on 07-10-2024): There is nobody in the world who have not done both good and evil, because life is a tangled web. Whatever a person does whether knowingly or unknowingly, if it is an evil, he is bound to suffer the consequences according to law of karma. There is no remedy for this except to accept. Likewise, when someone does the act of doing adulteration of food or corruption, if he is destined to be born as dog in the next birth, as per the version of Brahmin in Ramayana, perhaps the next generation might replace the mankind with dogs which will not happen and so there must have been some remedy somewhere. Adulteration and corruption is there everywhere in the world and we cannot alter or avoid.
2. శ్రీ గోనుగుంట మురళీకృష్ణగారి స్పందన (10-10-2024న): రాముడి పరిపాలన వంద శాతం ధర్మపరిపాలన. ఎక్కడా అవినీతి జరగ లేదు. శునకం భావం ఏమిటంటే, “దేవద్రవ్యాన్ని అపహరించటానికి మించిన పాపం లేదు. ఆ భిక్షకుడు క్రూరుడు. అవినీతి పరుడు. అతడు దేవద్రవ్యాపహరణ చేయటానికి అవకాశం ఉంది కనుక మఠాదిపతిగా చేయటమే తగిన శిక్ష.” అని.
ఈ వ్యాసం గురించి వాట్సప్ ద్వారా వచ్చిన స్పందన:
3. డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారి స్పందన (08-10-2024న): “రామాయణంలో కరప్షను (అవినీతి కథ)” శీర్షిక మొదలుకొని సబ్జెక్టు వరకూ చాలా వెరైటీగా, ఆసక్తిదాయకంగా ఉంది. నేను వినని కథ. ఆ కుక్క మాటల్లో ఎంత లోతయిన అర్థం ఉంది. ముందు నేను కూడా ఇదేంటి ఇలాంటి శిక్ష అనుకున్నాను. తర్వాత తెలిసింది. “ధర్మ కార్యాలు దైవకార్యాల నిర్వహణ చాలా జాగ్రత్తగా చేయాల్సింది” అని ఈ కథ ద్వారా బాగా చెప్పారు. అసలు ఈ కథ చెప్పాలన్న ఆలోచన మీకు వచ్చినందుకు మెచ్చుకోవాలి. చివరలో ప్రస్తుతపు ఇష్యూ అయిన తిరుపతి లడ్డూతో జోడించి అసలు కల్తీ ఎందుకు జరగాలి అన్న దాని గురించి ఆలోచించరేం అని సంధించిన ప్రశ్న బాగుంది. మొదటి కుక్క కథకు, లడ్డు కథకు సామ్యం, లింక్ భలేగా సరిపోయాయి. ఈ వ్యాసం ఈ రోజు ఒక కొత్త విషయాన్ని తెలియజేసింది నాకు.
LikeLike
“ద్యూత సభలో ద్రౌపది ప్రశ్న సబబేనా?” అన్న వ్యాసం గురించి సంచిక వెబ్ మాగజిన్లో వచ్చిన స్పందనలు:
1. డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారి స్పందన (22-09-2024న): వ్యాసం చాలా విశ్లేషణాత్మకంగా, విపుల వ్యాఖ్యాన సహితంగా బాగుంది. ఆ ఆఖరి మాటలు “ద్రౌపది ప్రశ్న ఓ గుణపాఠం.” అన్నవి భలే బాగున్నాయి.
2. శ్రీ గోనుగుంట మురళీకృష్ణగారి స్పందన (22-09-2024న): ద్యూతం జరిగిన విధానం గురించి, ద్రౌపది ప్రశ్నలకు సభికుల జవాబుల గురించి చక్కగా వివరించారు. కానీ భీష్ముడు మాత్రం ధర్మనిర్ణయం చేయడంలో అశక్తతను వ్యక్తపరచాడు అని చెప్పారు. వ్యాస భారతంలో భీష్ముడు కూడా “ముందే ద్యూతంలో ఓడిపోయిన ధర్మరాజుకు భార్యను ఒడ్డే హక్కు లేదు.” అని స్పష్టంగానే చెబుతాడు. అంతే కాకుండా, “దుర్బలుడు చెప్పినది ధర్మమైనా అధర్మమై పోతుంది.” అని అంటాడు. “మీరు దుర్బలులు ఏమిటి పితామహా!” అని ద్రౌపది అడిగితే “ఏనాడైతే నా రాజ్యాధికారాన్ని వదులుకున్నానో ఆ నాడే రాజు ఆజ్ఞలను ఔదల దాల్చవలసిన సేవకుడను అయ్యను.” అని చెబుతాడు. మీరు చివరగా నేటి న్యాయసూత్రాన్ని ఉదాహరిస్తూ ముగించడం బాగుంది.
3. శ్రీ ఎన్. యోగేశ్వర శాస్త్రిగారి స్పందన (22-09-2024న): చక్కగా సరళమైన భాషలో విపులీకరించారు. మరియు, ప్రస్తుత కాలానికి కూడ అన్వయించారు. ఇంకా విశేషమేమిటంటే, సత్యధర్మాలను సమర్థించకుండా మౌనంగా ఉన్నను, తప్పుడు సమర్థనలు చేసినా, యెట్టి వారలైనా శిక్షల నుండి తప్పుకో జాలరు, ఆలస్యమైనా శిక్ష తప్పదు, అని గుర్తు చేయడం.
LikeLike
“పరమానందయ్య శిష్యుల కథలో పరమార్థం” అన్న వ్యాసం గురించి డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారి స్పందన వాట్సప్ ద్వారా (23-03-2025):
నేను మీ అలోచనలకు చాలా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే నేను కూడా ఈ అలోచన మమత్వం గురించి చేస్తుంటాను. తప్పు చేసింది మన వాడయితే వాణ్ణి సమర్థించడం, ఎదుటివాడు కరక్ట్ అయినా వాడిని విమర్శించడం నాకు నచ్చదు. నిష్పక్షపాతంగా విశ్లేషించి తప్పు మన వాడిదయితే మనమే మందలించాలని అంటాను. ఎందుకంటే మన వాళ్ళ దగ్గరే మనకు చెప్పే చనువు ఉంటుంది. మనకు మనమే చెప్పుకోకపోతే పరాయి వాళ్ళు ఎందుకు చెపుతారు అంటాను (అలా చెప్పి ఎదుటివాళ్ళ కోపానికి గురయిన సందర్భాలు కూడా ఉన్నాయి, నువ్వూ మమ్మల్నే అంటున్నావా అని). ఈ గుణాన్ని నేను చాలా మందిలో చూశాను. మంచి చెడుల విశ్లేషణ చేసినప్పుడు మనస్సాక్షితో విచారణ చెయ్యాలి. లేకుంటే ఆత్మద్రోహం అవుతుంది. మరొకటి, మీరూ అన్నది. ఎదుటి వాళ్ళంతా చెడ్డవాళ్ళు, నేనే మంచివాణ్ణి, నేనే కరక్ట్ అనుకోవటం, ఆత్మపరిశీలన అనేది లేకపోవటం, స్వార్థం దీనికి కారణం అనుకుంటాను నేను. తన తప్పులను తాను గుర్తించగలగటం అనేది, ఆత్మవిమర్శ అనేది, మనం ఉత్తమ వ్యక్తిత్వంతో ఎదగటానికి దోహదపడతాయని నా విశ్వాసం. పరమానందయ్య శిష్యుల కథలను నిత్య దైనందిన, మానవ మనస్తత్వ చర్యలతో, స్వభావాలతో పోల్చి చెప్పటం బాగుంది. ప్రత్యక్షర సత్యాలు ఈ మీ మాటలు.
LikeLike
“చలపతి చాతుర్యం” అన్న వ్యాసం గురించి వాట్సప్ ద్వారా డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారి స్పందన (26-05-2025):
భలేగున్నాడండీ మీ చలపతి. మీ చలపతి ఏంటి, మన చలపతి. విశ్వమంతా నిండిన చలపతి. ఇలాంటి తెలివితేటలు, ఇంత జ్ఞానం వున్న వాళ్ళు ఊరికొక్కరు, ఇంటికొక్కరు ఉంటారు డెఫినిట్ గా. పాలిటిక్స్, ఎకనామిక్స్, వగయిరా అన్ని సబ్జక్ట్స్ లో అపరిమితమైన జ్ఞానం ఉందిగా. పరమానందయ్య శిష్యుడే నిజంగా. ఆయన వాదన అమోఘం. మంచి పాత్రను సృష్టించారు. ఎవర్నో మోడల్ గా పెట్టుకొని చిత్రించారేమో అనిపిస్తోంది. మీ ఊళ్ళో ఎవరయినా ఉన్నారా. ఇది చదివాక నేనూ ఆలోచిస్తున్నాను, మాలో ఎవరన్నా తడతారేమోనని. బాగుంది.
LikeLike