నా కవితా ఖండికలు

నేను రచించిన “నా కవితా ఖండికలు” అన్న పుస్తకం 12-09-2025న ఈ క్రింది లింకులో పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు. ఈ పుస్తకం మీద, మీరు సూచనలు/ వ్యాఖ్యలు ఇవ్వడానికి ఈ బ్లాగులో సదుపాయం ఉంది. ఉపయోగించుకోగలరు.

https://ia601002.us.archive.org/9/items/naa-kavitaa-khan-dikalu-free-ebook/Naa%20Kavitaa%20KhanDikalu%20Free%20Ebook.pdf

One thought on “నా కవితా ఖండికలు

  1. డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారి స్పందనలు:

    1. “నా కవితా ఖండికలు” అన్న పుస్తకం గురించి వాట్సప్ ద్వారా స్పందన (12-09-2025): మీ కవితలన్నీ సరళ సుందరంగా చిరు హాస్యంతో (కొన్ని), .. అన్నీ బాగున్నాయి. ఏ సబ్జక్టును వదల లేదుగా మీరు, అమ్మ, అహంకారం, గారెలు, కరోనా, కల్గూరగంప, వగయిరా, వగయిరా,.. కరోనా, సిందూరం టచింగ్ గా వున్నాయి. ఒక్కొక్క కవిత గురించి చెప్పాలంటే చాలా వుంది. నేను మాత్రం మనసులోనే ఆస్వాదించాను.

    2. “ఆపరేషను సింధూరు” అన్న కవితాఖండిక గురించి (సంచిక వెబ్ మాగజిన్లో 25-05-2025న): మానిషాద శ్లోకం, బోయవాడిని వాల్మీకి తిట్టిన తిట్టు, జంటలో ఒక పక్షి మరణం – వీటిని దృష్టిలో పెట్టుకుని, మననం చేసుకుంటూ మీరు ఆపరేషన్ సిందూర్ ని కళ్ళకు కట్టినట్టు వర్ణించిన తీరు అద్భుతం. అభినవ వాల్మీకి మోడి కాదె? అన్న మాటలు ఎంత ప్రతిష్ఠాత్మకంగా ఉన్నాయో. భరత మాత నుదుటి సిందూరమైన కాశ్మీర్ లో స్త్రీల నుదుటి సిందూరాన్ని ఉగ్రవాదులు తుడిచెయ్యటం, ఆపరేషన్ సిందూర్ ని సింధూర్ లా ప్రయోగించింది మన దేశం అనటం చదువరులను రోమాంచితం చేసే భావం. అభినందనలు.

    3. “రామరాజ్యం” అన్న కవితాఖండిక గురించి వాట్సప్ ద్వారా స్పందన (03-04-2025): బాలరాముడు, మర్యాదరాముడు, సకలగుణాభిరాముడు, రాజైన రాముడు – ఇలా ఒక్క రామునిలో ఎందరో రాములు కనిపించారు, మీ రచనలో. కుటుంబ సంబంధాలు రాముని కుటుంబంలో, మానవ సంబంధాలు రామరాజ్యంలో ఎలా నెలకొన్నాయి చెపుతూ రామరాజ్యాన్ని కళ్ళ ముందు నిలిపారు. రచన సరళ పద్యాలలో భాష భావాలు పెనవేసుకుని అందంగా సాగాయి. అర్థతాత్పర్యాలు కూడా ఇవ్వటం చాలా మందికి ఉపయోగపడుతుంది.

    Like

Leave a reply to Ranganadham Cancel reply