సమస్యాపూరణాల సమాహారం September 1, 2025September 14, 2025 ~ Ranganadham నేను రచించిన ” సమస్యాపూరణాల సమాహారం ” అన్న పుస్తకం 01-09-2025న ఈ క్రింది లింకులో పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు. ఈ పుస్తకం మీద, మీరు సూచనలు/ వ్యాఖ్యలు ఇవ్వడానికి ఈ బ్లాగులో సదుపాయం ఉంది. ఉపయోగించుకోగలరు. https://ia902909.us.archive.org/4/items/samasya-puranala-samaharam-free-e-book/Samasya%20Puranala%20Samaharam%20Free%20E-Book.pdf Share this: Click to share on X (Opens in new window) X Click to share on Facebook (Opens in new window) Facebook Like Loading... Related
శ్రీ చిరువోలు విజయ నరసింహారావు గారు 09-10-2025న వాట్సాప్ ద్వారా పంపిన అభినందన / ఆశీర్వచన పద్యాలు క్రింద ఇవ్వబడ్డాయి. తే.గీ. వివిధ యితిహాస విషయాలు పేర్కొనుచును క్రొత్త పదము లన్వేషించి, యుత్తమమగు పద్య పూరణల్ రచియించి, ప్రతిభఁ జూపి కవుల యభినందనల నంది, ఖ్యాతిఁ గాంచె. … 1 తే.గీ. నవ్య పద శోధనా సాధనమున, నందె వేసిన కరము సఫలమ్ము వెలయఁ జేయ, సమయ, సందర్భ, సముచిత స్థాయి నిలిపి హృద్యపూరణ లందించ పద్యములను ప్రౌఢ కవు లందు గణ్యుడై ప్రథితు డయ్యె. … 2 తే.గీ. పద్య గమకంబు ధారయు పరిఢవిల్ల, మధుర, మంజుల రసమయమైన రచన, పద్య కవితా విభూషణం బగుచు నలర రచనఁ జేసితి వయ్య, శ్రీ రంగనాధ! … 3 తే.గీ. అర్థ, తాత్పర్య వివరంబు లందుఁ జేర్చి పఠితల కవలీల గ్రహింప భాగ్య మొసగి, గ్రంథ సంపూర్తిఁ గావింప కష్టపడిన నీదు సంకల్ప శక్తికి, నీదు కృషికి వందనము లిడి, దీవించి, ప్రస్తుతింతు. … 4 LikeLike Reply
శ్రీ చిరువోలు విజయ నరసింహారావు గారు 09-10-2025న వాట్సాప్ ద్వారా పంపిన అభినందన / ఆశీర్వచన పద్యాలు క్రింద ఇవ్వబడ్డాయి.
తే.గీ. వివిధ యితిహాస విషయాలు పేర్కొనుచును
క్రొత్త పదము లన్వేషించి, యుత్తమమగు
పద్య పూరణల్ రచియించి, ప్రతిభఁ జూపి
కవుల యభినందనల నంది, ఖ్యాతిఁ గాంచె. … 1
తే.గీ. నవ్య పద శోధనా సాధనమున, నందె
వేసిన కరము సఫలమ్ము వెలయఁ జేయ,
సమయ, సందర్భ, సముచిత స్థాయి నిలిపి
హృద్యపూరణ లందించ పద్యములను
ప్రౌఢ కవు లందు గణ్యుడై ప్రథితు డయ్యె. … 2
తే.గీ. పద్య గమకంబు ధారయు పరిఢవిల్ల,
మధుర, మంజుల రసమయమైన రచన,
పద్య కవితా విభూషణం బగుచు నలర
రచనఁ జేసితి వయ్య, శ్రీ రంగనాధ! … 3
తే.గీ. అర్థ, తాత్పర్య వివరంబు లందుఁ జేర్చి
పఠితల కవలీల గ్రహింప భాగ్య మొసగి,
గ్రంథ సంపూర్తిఁ గావింప కష్టపడిన
నీదు సంకల్ప శక్తికి, నీదు కృషికి
వందనము లిడి, దీవించి, ప్రస్తుతింతు. … 4
LikeLike