నేను రచించిన “శ్రీరాముని అంతరంగము” అన్న కావ్యము ఈ క్రింది లింకులో 10-07-2025న పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు:
My thoughts
నేను రచించిన “శ్రీరాముని అంతరంగము” అన్న కావ్యము ఈ క్రింది లింకులో 10-07-2025న పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు:
శ్రీ డి. సుధాకర్ గారి స్పందన వాట్సప్ ద్వారా (11-06-2025):
“పౌలస్త్యహృదయము” ద్వారా ప్రేరితులై శ్రీరాముని అంతరంగం వ్రాయడం చాలా ముదావహం. రామాయణానికి అనుకూలంగా, ప్రతికూలంగా వచ్చిన వ్రాతలను చదివి, ఎందులోనైనా మనకి పనికి వచ్చే సందేశం మీద దృష్టి పెట్టాలన్న మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఆవకాయ, అమరావతి, రాజ్యాంగం, సమస్యాపూరణం, దత్తపదులు – ఇలా విభిన్నమైన విషయాల మీద మీ వ్యాసాలను చదివాను. ఈ మధ్య స్టాటిస్టికల్ ఆక్ట్ మీద కూడా మీరు వ్రాశారు. విద్యార్థి దశలో మీరు చాలా ప్రతిభ చూపారు. ఉద్యోగంలో మీ సిద్ధాంతాలకు రాజీ పడకుండా ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని అత్యున్నత పదవిలో రిటైర్ అయ్యారు. అవన్నీ ఒక ఎత్తు, రిటైర్ అయిన తరువాత మీరు చేస్తున్న ఈ సాహితీ ప్రక్రియ ఇంకో ఎత్తు. తెలుగు భాష మీద మీకు అభిమానం ఉందని తెలుసు కానీ ఇంత లోతయిన పట్టు ఉందని తెలిసి చాలా ఆనందంగా ఉంది. మనసుకు నచ్చిన విధంగా జీవించడం చాలా అరుదు. ఇదే విధంగా మీరు అనేక విషయాల గురించి పరిశోధించి మాలాంటి మనుషులకు తెలియజేయాలని కోరుతున్నాను.
LikeLike