సమస్యాపూరణాలు -I

01 - 09 - 2025న ప్రచురించిన "సమస్యాపూరణాల సమాహారం" అన్న నా పుస్తకంలో(Free E-Book), 456 సమస్యలకి నేను చేసిన 620 పూరణలు ఇవ్వబడ్డాయి. ఆ తరువాత పూరించిన సమస్యలు పుస్తక రూపంలో ఒక్కసారిగా ప్రచురించే ముందు ఇలా ఎప్పటికప్పుడు ఈ బ్లాగులో మీ ముందు ఉంచాలని అనుకున్నాను. ఈ భాగంలో 10 సమస్యలకి పూరణలు ఇవ్వబడ్డాయి. 1.  సమస్య: బలరాముడు సీతఁ జూచి ఫక్కున నవ్వెన్ కం. చెలు లన యతడే దారిని శిల … Continue reading సమస్యాపూరణాలు -I

గొడుగు

కం.   అడుగిడెను వామ నుండుగ, గొడు గొక కేల్బట్టి హోమగుండముఁ గడకున్, యడిగెను మూడడుగుల యిల, యడఁచగ బలి దుడుకు విష్ణు వతడని తెలిసెన్.                           … 1 (అడుగిడు = పాదముపెట్టు, కేలు = చేయి, హోమము = యజ్ఞము, గుండము = నిప్పులగుంట, కడ = సమీపము, ఇల = నేల, అడఁచు = అణచు, దుడుకు = గర్వము) యజ్ఞగుండము సమీపంలో గొడుగు ఒక చేత్తో పుచ్చుకొని వామనుడిగా పాదం పెట్టాడు. మూడు అడుగుల … Continue reading గొడుగు

భగవద్గీత

1. ఉ. కౌరవ సైన్యమందు గల గౌరవనీయుల జూచి, పార్థుడు గ్రారు లహం బడంచు తన గాండివమున్ జెయి జార్చి, నేనికన్ గోరను, భ్రాత్రు రక్తమును గ్రోలి జయించిన యట్టి రాజ్యమున్, ఈ రణ మేల నిప్పుడన, కృష్ణుడు వానితొ యప్పు డిట్లనెన్. కౌరవ సైన్యంలో ఉన్న పూజనీయులైన వ్యక్తులను చూసి, అర్జునుడు భయంకరమైన శత్రువుల గర్వాన్ని అణచే తన గాండీవ ధనుస్సును చేతినుండి జార్చి, నేను ఇక అన్నదమ్ముల రక్తము త్రాగి గెలిచే రాజ్యం కోరను, … Continue reading భగవద్గీత