Free E-Book on the Collection of Statistics Act, 2008

[Link to this Book was shared by E-Mail to the Hon’ble Prime Minister, the Hon’ble Minister of Statistics and the Hon’ble Minister of Law in the Union Government, the Cabinet Secretariat, the Secretary (Legislative Department), the Secretary & a few Senior Officers of the Ministry of Statistics and Programme Implementation, and the State / UT … Continue reading Free E-Book on the Collection of Statistics Act, 2008

వన్ అప్ ఎఫిషియన్సీ

వన్ అప్ ఎఫిషియన్సీ (one-up efficiency) అంటే ఎప్పటి కప్పుడు ఇతరుల కన్నా తాను కాస్త మెరుగు అని అనిపించుకోవడం, పనికొచ్చే పనిలోయైనా సరే పనికిరాని పనిలోయైనా సరే. మా చిన్నప్పుడు మా నాన్నగారు మమ్మల్ని నవ్వించడానికి చెప్పిన ఒక కథ దీన్ని చాలా బాగా వివరిస్తుంది అని నాకు పెద్దయిన తరువాత తెలిసింది. శ్రీరామచంద్రుడు రావణ సంహారం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చి అందరి సమక్షంలో పట్టాభిషిక్తుడవుతాడు. అందరి సమక్షంలో అంటే, తన అన్నదమ్ములు, తన … Continue reading వన్ అప్ ఎఫిషియన్సీ

యది హాస్తి తదన్యత్ర – మన టీవీ కార్యక్రమాలు

చాలా కాలం క్రితం శ్రీశ్రీ గారు సినిమాల గురించి ఎక్కడో ఒక ఇంటర్వ్యూ (interview) లో అన్న మాటలు నాకు ముందుగా గుర్తు చేసుకోవాలని ఉంది. ".... అసలు ఉత్తమ చిత్రాలు నిర్మిస్తే మన ప్రజలు చూడరని చెప్పడం కూడా మన ప్రొడ్యూసర్లకి పరిపాటి అయ్యింది. ఇది ఎంత అసందర్భంగా వున్నదో చెబుతా వినండి. ప్రతివాడూ తిండి కోసం హోటలుకి వెళ్ళాలి. అతడికి ప్రతిసారీ ఆహారం (మంచిది) లభించక పోవచ్చు. అయినా రోజూ హోటలుకి వెళ్ళక తప్పదు. … Continue reading యది హాస్తి తదన్యత్ర – మన టీవీ కార్యక్రమాలు

ఆయన తిట్టినా మనకి కోపం రాదు

కొంత మంది తిట్టినా ఎవ్వరికీ కోపం రాదు. వాళ్ళ పెద్దరికం అలాంటిది. అటువంటి వాళ్ళలో అగ్రగణ్యులు శ్రీ కాళ్ళకూరి నారాయణరావు (1871 - 1927) గారు. వీరు ఇంచుమించు తమ సమవయస్కులైన టంగుటూరి ప్రకాశం పంతులు గారితో పాటు ఆ రోజుల్లో నాటకాలు వేసే వారట. పంతులు గారు గుండ్రటి ముఖం కలవారు కాబట్టి నాయిక దమయంతి గాను, నారాయణరావు గారు నాయకుడు నలుడు గాను వేషం కట్టేవారట. ఆ విషయం పక్కన పెడితే, నారాయణరావు గారు … Continue reading ఆయన తిట్టినా మనకి కోపం రాదు

విద్యాలయాల్లో నా వింత అనుభవాలు

విద్యాలయాల్లో నా వింత అనుభవాలు ఎక్కువగా విద్యార్థులకి ఫాకల్టీ (faculty) లకి సంబంధించినవి. వీటిల్లో కొన్ని విన్నవి, కొన్ని స్వానుభవం లోనివి. కొన్ని మంచివి కొన్ని చెడువి. రెంటిలోనూ నేర్చుకునే విషయాలు ఉంటాయని నా నమ్మకం. విద్యాలయాల్లో జరిగిన తగాదాల గురించి నేను వ్రాయడం లేదు. ఎందుకంటే, అందులో నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదని నా అభిప్రాయం. నాతో పోలిస్తే తోటి విద్యార్థులలో చాలా పెద్దవాళ్ళు ఉండడం అనేది నాకు 6వ క్లాసులోనే మొదలయ్యింది. నేను 8 ఏళ్ళ … Continue reading విద్యాలయాల్లో నా వింత అనుభవాలు

మన యూనియన్లు, అసోషియేషన్లు

యూనివర్సిటీ (University) లో సీటు వచ్చిందని తెలియగానే చేరడానికి వెళ్ళి ప్రవేశ రుసుం (Admission fee) కట్టడానికి క్యూ (Queue) లో నిలబడతాము. డబ్బు కట్టిన తర్వాత, ఒక రసీదు (receipt) ఇస్తారు కదా. దానిలో ట్యూషన్ ఫీజు (Tution fees), లైబ్రరీ ఫీజు (Library fees), ఇంకా ఇతర ఫీజులు కాక స్టూడెంట్స్ యూనియన్ ఫీజు (Students Union Fees) అని పది రూపాయలో ఇరవై రూపాయలో (ఎంతైతే అంత) వసూలు చేసినట్లుగా ఉంటుంది. ఏదో … Continue reading మన యూనియన్లు, అసోషియేషన్లు

ఆఫీసుల్లోని ముచ్చట్లు, అగచాట్లు

ఆఫీసు (office) అంటే, చిన్నో పెద్దో ఒక కార్యాలయము (office), ఆ ఆఫీసుకి నిత్యకృత్యంగా కేటాయించబడిన కొన్ని విధులు (duties), కొన్ని అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి చేయవలసి వచ్చే విధులు, ఇవన్నీ నిర్వర్తించడానికి వేరు వేరు స్థాయిలలో (levels) నియమించబడిన సిబ్బంది (staff), వాళ్ళ జీతాలకి ఇతర ఖర్చులకి ఒక బడ్జెట్టు (budget), ఆ ఆఫీసు వారు అందించే ప్రజా సేవలు, వాటిల్లో అసంతృప్తి తాలూకు ఫిర్యాదులు (complaints), వాటిని దూరం చేసే మార్గాలు, ఇవన్నీ నిర్వహించడానికి … Continue reading ఆఫీసుల్లోని ముచ్చట్లు, అగచాట్లు

గొడుగు

కం.   అడుగిడెను వామ నుండుగ, గొడు గొక కేల్బట్టి హోమగుండముఁ గడకున్, యడిగెను మూడడుగుల యిల, యడఁచగ బలి దుడుకు విష్ణు వతడని తెలిసెన్.                           … 1 (అడుగిడు = పాదముపెట్టు, కేలు = చేయి, హోమము = యజ్ఞము, గుండము = నిప్పులగుంట, కడ = సమీపము, ఇల = నేల, అడఁచు = అణచు, దుడుకు = గర్వము) యజ్ఞగుండము సమీపంలో గొడుగు ఒక చేత్తో పుచ్చుకొని వామనుడిగా పాదం పెట్టాడు. మూడు అడుగుల … Continue reading గొడుగు

శ్రీ రామభద్ర శతకము

మా గురువుగారు కీ.శే. శ్రీ చిరువోలు దుర్గాప్రసాదరావు గారు రచించిన "శ్రీ రామభద్ర శతకము" 06-10-2025న ఈ-బుక్ (E-Book) గా ఈ క్రింది లింకులో పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు. ఈ శతకం మీద మీరు సూచనలు/ వ్యాఖ్యలు ఇవ్వడానికి ఈ బ్లాగులో సదుపాయం ఉంది. ఉపయోగించుకోగలరు. https://ia600209.us.archive.org/35/items/shri-ramabhadra-shatakamu-free-e-book_20251006/Shri%20Ramabhadra%20Shatakamu%20Free%20E-Book.pdf

నా తెలుగు వ్యాసావళి

నేను రచించిన "నా తెలుగు వ్యాసావళి" అన్న పుస్తకం 18-09-2025న ఈ క్రింది లింకులో పెట్టబడినది. డౌన్ లోడ్ (download) చేసుకొని చదువగలరు. ఈ పుస్తకం మీద, మీరు సూచనలు/ వ్యాఖ్యలు ఇవ్వడానికి ఈ బ్లాగులో సదుపాయం ఉంది. ఉపయోగించుకోగలరు. https://ia601006.us.archive.org/18/items/naa-telugu-vyasaavalhi-free-e-book/Naa%20Telugu%20Vyasaavalhi%20Free%20E-Book.pdf